ఉత్తమ దర్శకుల జాబితాలో వైవిధ్య నటుడు

రొటీన్‌ పాత్రలకు భిన్నంగా నటించే కథానాయకుల్లో కన్నడ నటుడు ఉపేంద్ర ఒకరు. సినిమా సినిమాకు సరికొత్త క్యారెక్టర్‌ లో దర్శనిమిస్తూ అభిమానుల్ని అలరించే ఈయన తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితుడు. ఉపేంద్ర నటుడే కాదు దర్శకుడు కూడా. కన్నడలో 9 చిత్రాలకు దర్శకత్వం వహించారాయన. ఆ దర్శకత్వ ప్రతిభకే తాజాగా అరుదైన గౌరవం దక్కింది. బీఎండీబీ అనే సంస్థ 50మంది ఉత్తమ దర్శకుల జాబితా విడుదల చేయగా.. అందులో 17వ స్థానాన్ని పొందాడు ఉపేంద్ర. అటు నటుడిగా అలరిస్తూనే ఇటు దర్శకుడుగా మారి ఇలాంటి అవార్డు సంపాదించడం విశేషం. ఆయన దర్శకత్వం వహించిన ‘ఏ’, ‘ఓం’ సినిమాలు తెలుగులోనూ రిలీజ్ అయ్యాయి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.