తెలుగులో వస్తున్న `విశ్వాసం`

ప్రముఖ హీరో అజిత్‌, డైరెక్ట‌ర్ శివ కాంబినేష‌న్‌లో రూపొందిన యాక్ష‌న్ కథా చిత్రం `విశ్వాసం`. ఈ సినిమా త‌మిళ‌నాట సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం అక్క‌డ మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది. అజిత్ స‌ర‌స‌న లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టించింది. ఈ చిత్రాన్ని స‌త్య‌జ్యోతి ఫిలింస్ అసోషియేష‌న్‌తో ఎన్‌.ఎన్‌.ఆర్ ఫిలింస్ ప‌తాకంపై ఆర్‌.నాగేశ్వ‌ర‌రావు తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఇందులో విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టించారు. అంతేకాకా ఇంకా ఇతర నటులు అనైక‌, వివేక్, రోబో శంక‌ర్‌, యోగిబాబు త‌దిత‌రులు. ఈ సినిమా అనువాద కార్య‌క్ర‌మాల‌న్నింటినీ పూర్తి చేసి ఈ చిత్రాన్ని మార్చి 1న విడుద‌ల చేయ‌నున్నారు.ఈ సంద‌ర్భంగా .. ఎన్‌.ఎన్‌.ఆర్ ఫిలింస్ అధినేత ఆర్.నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ.. ``హీరో అజిత్ సినిమాల‌కు త‌మిళ‌నాడులోని క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయన సినిమా విడుద‌లంటే అక్క‌డ పండుగ వాతావర‌ణ‌మే. ఎందరో నిర్మాత‌లు ఈ సినిమా తెలుగు హ‌క్కుల కోసం పోటీ ప‌డ్డారు. స‌త్యజ్యోతి ఫిలింస్ వారి అసోసియేష‌న్‌తో తెలుగులో ఈ చిత్రాన్ని మార్చి 1 విడుద‌ల చేయ‌బోతున్నాం. త‌మిళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా సెన్సేష‌న‌ల్ స‌క్సెస్ అవుతుంది`` అన్నారు.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.