విక్రమ్‌ ఇంటి నుంచి మరో హీరో వచ్చేస్తున్నాడు

కే
వలం దక్షిణాదిలోనే కాక.. ఉత్తరాది చిత్రసీమలోనూ మంచి క్రేజ్‌ దక్కించుకున్న కథానాయకుడు చియాన్‌ విక్రమ్‌. ప్రస్తుతం ఆయన తన తనయుడు ధృవ్‌ని ‘ఆదిత్య వర్మ’ చిత్రంతో వెండితెరకు పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారు. తెలుగు హిట్‌ మూవీ ‘అర్జున్‌రెడ్డి’కి రీమేక్‌గా ఈ సినిమాను రూపొందించడం విశేషం. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఓవైపు విక్రమ్‌ నట వారసుడు తెరపై అడుగుపెడుతుండగానే.. ఆయన ఇంటి నుంచి మరో యువ హీరో తమిళ తెరపైకి వచ్చి వాలబోతున్నాడు. ఇంతకీ ఆ యువ హీరో మరెవరో కాదు.. విక్రమ్‌ చెల్లెలి తనయుడు అర్జుమాన్‌ పొల్లద ఉలగిల్‌. త్వరలోనే ‘ఉలగిల్‌ బయంగర గేమ్‌’ అనే చిత్రంతో అర్జుమాన్‌ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. ప్రస్తుతం దీనికి సంబంధించిన లుక్‌ ఒకటి సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. లుక్స్‌ పరంగా అర్జుమాన్‌ను చూస్తుంటే విక్రమ్‌కు దాదాపు జిరాక్స్‌లాగే కనిపిస్తున్నాడు. మరి నటనలోనూ మామకు తగ్గ అల్లుడిగానే పేరు తెచ్చుకుంటాడో లేదో వేచి చూడాలి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.