‘ఆమె’ ‘మహానటి’ని వద్దనుకుందట


టీనటులందరికీ కొన్ని డ్రీమ్‌ రోల్స్‌ ఉంటాయి. ఫలానా పాత్రను పోషించాలనుకుంటున్నాని ఇంటర్వ్యూల్లో తమ అభిప్రాయాల్ని చెప్తుంటారు. అలాంటి అవకాశాలు కథానాయికల్ని వెతుక్కుంటూ రావడం అరుదు. వచ్చినప్పుడు ఎవరికైనా వదులుకోవాలని ఉండదు. కానీ అమలాపాల్‌ మాత్రం వ్యక్తిగత సమస్యల కారణంగా ఓ పెద్ద సినిమాలోని మంచి పాత్రను వదులుకుందట. ఈ విషయాన్ని అమలాపాల్‌ ‘ఆమె’ ప్రొమోషన్‌ సమయంలో తెలిపింది. ఇంతకీ అదేం సినిమా అంటే.. సావిత్రి బయోపిక్‌ ‘మహానటి’. ఈ సినిమా కథానాయిక అన్వేషణలో చిత్ర బృందం చాలా మంది హీరోయిన్లను సంప్రదించిన విషయం తెలిసిందే. వీరిలో తొలి ఆప్షన్‌ అమల్‌పాలేనంట. ‘సావిత్రి పాత్ర కోసం ఆ చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ నన్ను కలిశారు. ఆ సమయంలో వ్యక్తిగత కారణాల వల్ల ఆ సినిమాకు నో చెప్పాన’ని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఏది ఏమైనా ఓ గొప్ప అవకాశం కీర్తికి దక్కింది. తనే ‘మహానటి’ అనిపించుకుంది. మరి అలాంటి పాత్రలో అమలాపాల్‌ను ఊహించగలమా?.. ప్రస్తుతం అమలా నటించిన ‘ఆమె’ చిత్రం జులై 19న విడుదలవుతోంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.