శేఖర్‌ మాస్టర్‌ చేతుల్లో ‘సామజవరగమణ’

ఈ మధ్య కాలంలో సామజవరగమణ పాట అత్యధిక మంది సంగీత ప్రియులు మెచ్చిన గీతం. ‘అల వైకుంఠపురములో’ చిత్రం నుంచి విడుదలైన గీతం సామాజిక మాధ్యమాల్లో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలు పొందిన దక్షిణాది గీతంగా నిలిచింది ఈ పాట. తమన్‌ సంగీత సారథ్యంలో సిరివెన్నెల సాహిత్యంతో సిద్‌ శ్రీరామ్‌ ఆలపించిన ఈ గీతం కుర్రకారును ఒక ఊపు ఊపేస్తోంది. ప్రస్తుతం ఈ గీతాన్ని పారీస్‌లోని సుందరమైన ప్రదేశాల్లో చిత్రీకరిస్తున్నారు. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్, పూజ హెగ్డే లపై చిత్రీకరిస్తున్న ఈ అందమైన గీతానికి శేఖర్‌ మాస్టర్‌ నృత్యాలు సమకూరుస్తున్నారు. ఆడియో పరంగా చిత్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గీతాన్ని శేఖర్‌ మాస్టర్‌ ఎలా చిత్రీకరిస్తున్నారో అని ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు సినీ జనాలు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.