కన్నడ నుంచి తెచ్చి.. తెలుగు - తమిళ్‌లో చూపి!!

‘గరుడవేగ’, ‘కల్కి’ చిత్రాలు యాంగ్రీ స్టార్‌ రాజశేఖర్‌ సినీ కెరీర్‌కు కొత్త ఊపును తీసుకొచ్చాయి. ఇటీవల ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో చేసిన ‘కల్కి’ కమర్షియల్‌గా మిశ్రమ ఫలితాన్ని అందించినప్పటికీ నటుడిగా రాజశేఖర్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడీ ఉత్సాహంలోనే తన తర్వాతి ప్రాజెక్టు కోసం కథలు సిద్ధం చేసుకుంటున్నాడు. తాజాగా సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ యాంగ్రీస్టార్‌ త్వరలోనే ఓ కన్నడ రీమేక్‌ను పట్టాలెక్కించబోతున్నాడట. అంతేకాదు దీన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించనున్నారట. ఈ సినిమాలో సత్యరాజ్‌ తనయుడు శిబి ఓ కీలక పాత్రను పోషిస్తాడట. దీనికి దర్శకుడిగా ఎవరు వ్యవహరిస్తారన్నది ఇంకా తెలియనప్పటికీ తమిళ నిర్మాత ధనుంజయ్‌ రూపొందిస్తాడని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.