బ్రిటన్‌ అమ్మాయితో ఆర్యన్‌ డేటింగ్‌!

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌ పెద్ద కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ ఈ మధ్యనే అందరికి బాగా సుపరిచితమైన పేరు. ‘ది లయన్‌ కింగ్‌’ చిత్రానికి హిందీలో డబ్బింగ్‌ చెప్పారు. తండ్రి షారుక్‌ ముఫాసాకు గాత్ర దానం చేయగా, ఆర్యన్‌ ఖాన్‌ ముఫాసా బిడ్డ సింబాకు డబ్బింగ్‌ చెప్పారు. ఈ సినిమాతో మొదటిసారిగా తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టినట్లు చెప్పుకోవచ్చు. ఆర్యన్‌ తన చదువు అంతా బ్రిటన్‌లోనే సాగించారు. ఆసయంలోనే ఓ అమ్మాయితో డేటింగ్‌ చేస్తున్నారని సమాచారం బయటకు వచ్చింది. తన తల్లి గౌరీఖాన్‌ను ఆ అమ్మాయికి పరిచయం చేశాడట. అందరు కలిసి సరదాగా మాట్లాడుకున్నారట. గౌరీ కూడా అమ్మాయిని చూసి మంచి బుద్దిగల అమ్మాయి అంటూ సర్టిఫికెట్‌ కూడా ఇచ్చిందట. మొత్తం మీద కాబోయో కోడలి పిల్లని తల్లి గౌరికి ముందుగానే పరిచయం చేశాడన్న మాట. మొత్తం బ్రిటన్‌లో చదువులతో పాటు ప్రేమ పాఠాలు కూడా నేర్చుకున్నాడు అంటూ సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. తన మొదటి సినీ ప్రయాణాన్ని ‘ది లయన్‌ కింగ్‌’తో ప్రారంభించాడు. ఈ చిత్రం ఈరోజే 9జులై 19, 2019)న హిందీ, తెలుగు, తమిళంలో తెరపైకి వచ్చింది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.