‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో పాటలెన్నో తెలుసా?

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ ప్రధాన కథానాయకలుగా రాజమౌళి ప్రతిషా’త్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. ఈ చిత్రం గురించి ఏ వార్త బయటకు వచ్చినా చిత్రసీమ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్, కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమాలో సమారు ఏడు పాటలు ఉంటాయని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అవి ఎలాంటి గీతాలు అనేది ఇంకా తెలియదు. ఆవేశంతో కూడినవి, చైతన్యం రగిల్చేవి, మరికొన్ని ప్రేమ పాటలు కూడా ఉండొచ్చని వినికిడి. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన కొన్ని పాటలను ప్రముఖ సినీ గేయరచయిత సుద్దాల అశోక్‌ తేజ రాశాడని సమాచారం. విప్లవ, ప్రేమ గీతాలు రాయడంలో సుద్దాలకు వెన్నతో పెట్టిన విద్య. సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు విదేశాల్లో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. చిత్రంలో బాలీవుడ్‌ కథానాయిక అలియా భట్‌ రామ్‌చరణ్‌ సరసన చేస్తుంది. ఇంకా చిత్రంలో సముద్రఖని, రాహుల్‌ రామకృష్ణ, ప్రత్యేక పాత్రలో అజయ్‌ దేవగణ్‌లు నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌ పతాకంపై నిర్మితమౌతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సినిమా జులై 30, 2020న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.