బెల్లంకొండ సినిమా రీమేక్‌లో విష్ణు విశాల్‌?

ఇక్కడ ప్రేక్షకాదరణ లభించిన కొన్ని తెలుగు సినిమాలు ఇతర చిత్ర పరిశ్రమల వారిని ఆకర్షిస్తుంటాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటించిన ‘కవచం’ తెలుగు ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేదనే విషయం తెలిసిందే. అయితే ఈ కథ నచ్చడంతో కోలీవుడ్‌ నిర్మాతలు కొందరు తమిళ్‌లో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ రీమేక్‌లో కథానాయకుడుగా యువ కథానాయకుడు విష్ణు విశాల్‌ నటిస్తున్నాడని సమాచారం. తమిళ్‌ ప్రేక్షకుల్ని ‘కవచం’ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. బెల్లంకొండ ఇటీవలే నటించి విజయం అందుకున్న ‘రాక్షసుడు’ సినిమా విష్ణు విశాల్‌ తమిళ్‌లో నటించిన చిత్రానికి రీమేక్‌. ఇప్పుడు సాయి సినిమాను విశాల్‌ రీమేక్‌ చేయడం విశేషం.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.