చిరు సరసన ఐశ్వర్యారాయ్‌?


టాలీవుడ్‌ అగ్ర నటుడు చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా విడుదలకు ముందే తన 152వ చిత్రం మొదలుపెడుతున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దరకత్వం వహించనున్నారు. కథానాయికగా నయనతార ఎంపికైనట్లు వార్తలు వెలువడినా ప్రస్తుతం ఆ పేరు మారినట్లు సమాచారం. బాలీవుడ్‌ నటి ఐశ్వర్యారాయ్‌ను తీసుకుంటున్నట్లు వినిపిస్తోంది. చిరంజీవి పక్కన ఇప్పటి వరకు నటించని హీరోయిన్‌ అయితే బావుంటుందనే ఉద్దేశంతోనే కథానాయికను మారుస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీపై రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నారు. 2020 వేసవిలో విడుదలకు సన్నాహాలు చేస్తుందీ చిత్ర బృందం.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.