కల్యాణ్‌దేవ్‌ అవయవదానం
చిరంజీవి అల్లుడు, కథానాయకుడు కల్యాణ్‌దేవ్‌ అవయవదానం చేయడానికి ముందుకొచ్చారు. సోమవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా అందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘మన అవయవాలు దానం చేయడం కోసం మన సమ్మతిని తెలపడానికి ఒక్క నిమిషం చాలు. కానీ ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి కుటుంబ సభ్యులు, స్నేహితులకి చెబితే వాళ్లు మనం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించడమే కాకుండా, సంతోషిస్తారు. అవయవాలని దానం చేయాలనే కోరికని కలిగించేవాళ్లలో మనం కూడా ఒకరం అవుతాం. ఈ లోకాన్ని విడిచి వెళ్లేటప్పుడు ఎవరం ఏమీ తీసుకెళ్లలేం. అవయవదానం ఓ యజ్ఞం. ఇందులో అందరూ భాగం కావాల’’ని చెప్పారు. కల్యాణ్‌దేవ్‌ తన రెండో చిత్రాన్ని పులివాసు దర్శకత్వంలో చేయబోతున్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.