చిరుకు మణిశర్మ స్వరాలు..
చిరంజీవి సినిమాకి మణిశర్మ సంగీతం అనే మాట వినిపించిందంటే చాలు. ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయేవి. వారి కలయికలో గుర్తుండిపోయే పాటలు వచ్చాయి. అవి శ్రోతల్ని ఇప్పటికీ ఉర్రూతలూగిస్తుంటాయి. ఇక నేపథ్య సంగీతం మరో ఎత్తు. ‘బావగారూ బాగున్నారా?’ ‘చూడాలని ఉంది’, ‘ఇద్దరు మిత్రులు’, ‘అన్నయ్య’, ‘ఇంద్ర’, ‘ఠాగూర్‌’ తదితర చిత్రాలు ఈ కలయిక ప్రత్యేకతని చాటి చెప్పాయి. సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ ఈ కలయిక కుదిరినట్టు సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూర్చబోతున్నట్టు తెలిసింది. చివరిగా ఈ కలయికలో ‘స్టాలిన్‌’ రూపొందింది. కొత్త చిత్రం కోసం ఇప్పటికే మణిశర్మ పనులు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.