ప్రేమలో పడ్డాక...
విష్వంత్, పల్లక్‌ లల్వాని జంటగా నటించిన చిత్రం ‘క్రేజీ క్రేజీ ఫీలింగ్‌’. సంజయ్‌ కార్తీక్‌ దర్శకుడు. నూతలపాటి మధు నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు సంజయ్‌ మాట్లాడుతూ ‘‘ప్రేమలో పడిన ఓ జంట ప్రయాణంతో పాటు... వాళ్ల ప్రేమాయణంలోని ఆనందాల్ని, అనుభూతుల్ని వినోదాత్మకంగా చూపించే ప్రయత్నమే ఈ చిత్రం. వెన్నెల కిషోర్‌ పాత్ర ఆకట్టుకుంటుంది’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘సంజయ్‌ ఒక మంచి ప్రేమకథకి హాస్యాన్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. శరణ్య, సుమన్, పోసాని తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: భీమ్స సిసిరోలియో.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.