బన్నీ నాయికతో దేవరకొండ రొమాన్స్‌!
‘మహానటి’, ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ వంటి హిట్లతో గతేడాదిని అద్భుతంగా ముగించాడు సెన్షేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం భరత్‌ కమ్మ దర్శకత్వంలో ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో విజయ్‌కు జోడీగా రష్మిక మందన్నా నటిస్తోంది. దీని తర్వాత విజయ్‌ క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన ఈ చిత్రం.. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. తాజాగా ఈ సినిమాలో కథానాయిక పాత్రకు సంబంధించి ఓ ఆసక్తికర అంశం బయటకొచ్చింది. ఇందులో దేవరకొండకు జోడీగా కేథరీన్‌ను తీసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. దర్శకుడు ఇప్పటికే క్యాథీని కలిసి కథ వినిపించాడని.. అది ఆమెకు కూడా నచ్చడంతో సినిమాకు ఓకే చెప్పిందని ఫిలిం వర్గాల నుంచి సమాచారం అందుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి విజయ్‌ - క్యాథీల జోడీకి బాక్సాఫీస్‌ వద్ద మంచి హిట్‌ పడితే.. ఆమె మళ్లీ తెలుగులో బిజీ అయ్యే ఛాన్స్‌ పుష్కలంగా ఉంటుంది. కేథరీన్‌ చివరిగా ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో నటించింది.
సంబంధిత వ్యాసాలు


© Sitara 2018.
Powered by WinRace Technologies.