ధనుష్‌ చిత్రంలో ఐశ్వర్వ

ప్రముఖ మళయాలి నటి ఐశ్వర్య లక్ష్మి త్వరలోనే ధనుష్‌తో కలిసి ఓ చిత్రంలో నటించనుంది. అధికారికంగా ఈ సమాచారం చిత్రబృందం బయటపెట్టలేదు. వై నాట్‌ స్టూడియోస్‌ పతాకంపై నిర్మించనున్న సినిమాకి కార్తిక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఐశ్వర్య ఇప్పటికే మళయాళంలో పృథ్వీరాజ్‌తో కలిసి ‘బ్రదర్స్‌ డే’ అనే చిత్రంలో నటిస్తుంది. తమిళంలో సుందర్‌.సి దర్శకత్వంలో విశాల్‌తో కలిసి నటిస్తుంది. ఇందులో తమన్నా కూడా నటిస్తుంది. 2017లోనే ఈ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు ధనుష్‌ - కార్తిక్‌. కానీ హాలీవుడ్‌ నటుడు ఆల్‌ పాసినో ఇందులో నటించాల్సి ఉంది.  పాసినో డేట్స్‌ సర్దుబాటు కాకపోవడంతో సినిమా పనులు ప్రారంభం కాలేదు. త్వరలోనే ఆల్‌ పాసినో కూడా చేరతాడని చిత్ర బృందం చెబుతోంది. ప్రస్తుతం ధనుష్‌ వెట్రిమాన్‌ దర్శకత్వంలో ‘అసురన్‌’ అనే చిత్రం చేస్తున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.