దర్బార్‌ మాస్‌ మూవీ: మురగదాస్‌

సందేశాత్మక చిత్రాలకు కమర్షియల్‌ హంగులు జోడించి చెప్పటంలో దిట్ట మురగదాస్‌. ప్రస్తుతం ఆయన సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ కథానాయకుడిగా ‘దర్బార్‌’ చిత్రం తెరకెక్కించారు. 2020 సంక్రాతి కానుకగా విడుదల కానుంది ఈ చిత్రం. అయితే ఈ సినిమా ఒక పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఉండబోతుందనే వార్తలు నెట్‌లో వైరల్‌గా మారాయి. ఈ న్యూస్‌ అవాస్తవం అని, దర్బార్‌ ఒక మాస్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ అని వివరణ ఇచ్చారు మురుగదాస్‌. నెట్‌లో వస్తున్న వదంతులకు ఈ స్టార్‌ దర్శకుడు సమాధానం ఇవ్వడం వెనుక ఒక కారణం ఉంది. ఆయన ఇంతకు ముందు దర్శకత్వం వహించిన చిత్రం ‘సర్కార్‌’ పొలిటికల్‌ మూవీగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ‘సర్కార్‌’ విడుదల తరువాత రాజకీయ పరంగా కొన్ని వివాదాలు చోటుచేసుకున్నాయి. మళ్ళీ ‘దర్బార్‌’ చిత్రం కూడా రాజకీయ పరిణామాలు చూట్టూ నడుస్తుందనీ ఇందులో కూడా వివాదస్పద అంశాలు ఉన్నాయనే వార్తలు ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. విడుదలకు ముందే ‘దర్బార్‌’పై ఇలాంటి టాక్‌ రావడం డైరెక్టర్‌కు ఇష్టం లేదు. అందుకోసమే ఈ సినిమా ఒక మాస్‌ ఎంటర్‌టైనర్‌ అని, ఇందులో రజినీ పాత్ర పోలీస్‌ అలెక్స్‌ పాండియన్‌ స్టైల్‌లో ఉంటుందనే ఆసక్తికర విషయం వెల్లడించారు దర్శకుడు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.