త్వరలోనే ‘ఎఫ్‌2’ టీజర్‌?


వెంకటేష్, వరుణ్‌తేజ్‌ కథానాయకులుగా నటించిన చిత్రం ‘ఎఫ్‌ 2’. ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌ అనేది ఉపశీర్షిక. తమన్నా, మెహరీన్‌ కథానాయికలు. అనిల్‌రావిపూడి దర్శకత్వం వహించారు. దిల్‌రాజు నిర్మాత. ఒకపాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ఈనెల 12న టీజర్‌ని విడుదల చేస్తారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘కుటుంబమంతా కలిసి చూసే చిత్రాల్ని నిర్మించడం మా సంస్థకు అలవాటు. ‘ఎఫ్‌ 2’ కూడా ఆ ప్రమాణాలతోనే నిర్మించాం. ఇదో నవ్వుల ప్రయాణం. వినోదానికి కేరాఫ్‌ అడ్రస్‌.. వెంకటేష్‌. అలాంటి చిత్రాలతోనే అనిల్‌రావిపూడి కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే ఈసారి రెట్టింపు వినోదాలు అందివ్వనున్నాం. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. త్వరలోనే ఒకొక్క పాటని విడుదల చేస్తాం. మిగిలిన పాటనీ త్వరలోనే తెరకెక్కిస్తామ’’న్నారు.హైలెట్‌:© Sitara 2018.
Powered by WinRace Technologies.