ప్రముఖ దర్శకుడు ‘ఫ్రాంకో’ కన్నుమూత

హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ చిత్ర దర్శకుడు, రాజకీయనాయకుడు ఫ్రాంకో జెఫిరెల్లి రోమ్‌లో శనివారం నాడు కన్నుమూశారు. 96 సంవత్సరాల వయసులోను చాలా హుషారుగా ఉండేవారని సస్నిహితులు చెప్పేవారు. ప్రఖ్యాత నటి ఎలిజబెత్‌ టేలర్‌, రిచర్డ్ బర్టన్‌ నటించిన ‘టేమింగ్‌ ఆఫ్‌ ది ష్రూ’తో పాటు 1968లో తెరపైకి వచ్చిన ‘రోమియా అండ్‌ జూలియట్‌’లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించింది ఫ్రాంకోనే. కొన్ని సంవత్సరాలుగా ఒకే వృత్తిలో కొనసాగటం అనేది చాలా గొప్ప విషయం. అలనాటి ప్రముఖ నాటక రచయిత షేక్స్ ఫియర్‌ అంటే ఫ్రాంకోకు చెప్పలేనంత అభిమానం. అందుకే ఆయనను ఆదర్శంగా తీసుకొని కొన్ని నాటకాలకు కూడా దర్శకత్వం వహించారు. అంతేకాక 1986లో ‘ఒతెల్లో’, 1990లో ‘హామ్లెట్‌’లాంటి చిత్రాలు తీసి ఉత్తమ అవార్డులు సంపాదించారు. ఫ్రాంకో జెఫిరెల్లి ఫిబ్రవరి 12, 1923వ సంవత్సరంలో ఇటలిలోని ప్లొరెన్స్ పుట్టారు.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.