జోరు పెంచిన గోపీచంద్‌.. సంపత్‌నందితో సినిమా షురూ!
థానాయకుడుగా, ప్రతినాయకుడుగా విలక్షణ నటన చూపించే నటుల్లో గోపీచంద్‌ ఒకరు. త్వరలో ‘చాణక్య’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. ఇదొక స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మరో కొత్త చిత్రాన్ని ఓకే చేశాడు గోపీ. బిను సుబ్రహ్మణ్యం అనే నూతన దర్శకుడితో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవలే లాంఛనంగా చిత్రీకరణ మొదలైంది. ఇదొక పవర్‌ఫుల్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌గా తెరకెక్కబోతుంది. తాజాగా మరొకటి చిత్రానికి పచ్చ జండా ఊపాడు. ‘యూ టర్న్‌’ చిత్రం అందించిన శ్రీనివాసా సిల్వర్ స్ర్కీన్‌ పతాకంపై నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. గోపీచంద్ 28వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఇతర వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. గతంలో సంపత్‌ దర్శకత్వంలో ‘గౌతమ్‌ నంద’ సినిమాలో నటించారు గోపీ చంద్‌. ఇప్పుడు మళ్లీ అదే కాంబోతో రావడంతో అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.