లాయర్‌గా జగపతి బాబు?

విలన్‌ పాత్రతో రీ ఎంట్రీ ఇచ్చి, ఆ పాత్రకే చిరునామాగా మారాడు ఫ్యామిలీ హీరో జగపతి బాబు. ప్రతి సినిమాలోనూ ఉగ్రరూపంలో కనిపించే ఆయన త్వరలో లాయర్‌గా కనిపించబోతున్నాడు. ఆయన అలా దర్శనమిచ్చేది సినిమాలో కాదు. ‘కంత్రి’, ‘బిల్లా’, ‘షాడో’ చిత్రాల దర్శకుడు మెహర్‌ రమేష్‌ చాలా కాలం విరామం తర్వాత ఓ వెబ్‌ సిరీస్‌ రూపొందిస్తున్నాడు. ఇందులో జగపతి బాబు నటించబోతున్నారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే లాయర్‌ పాత్రలో జగపతి కనిపించనున్నారట. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానుందని సినీ వర్గాల సమాచారం. ఈ వైవిధ్యమైన క్యారెక్టర్‌తో ఎలా మెప్పిస్తాడో చూడాలంటే వేచి చూడాల్సిందే. గతంలో ‘గ్యాంగ్‌ స్టర్స్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో నటించాడు జగపతి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.