జ్యోతిక, రేవతి వస్తున్నారు!
పెళ్లయిన తర్వాత మహిళా సాధికారత చిత్రాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు జ్యోతిక. ‘36 వయదినిలే’, ‘మగళీర్‌మట్టుం’, ‘నాచ్చియార్‌’, ‘కాట్రిన్‌మొళి’ వంటి పలు చిత్రాల్లో నటించి విజయాలను అందుకున్నారు. రాజ్‌ అనే కొత్త దర్శకుడి చిత్రంలో ఇప్పటికే ఆమె నటిస్తున్నారు. తాజాగా ఓ హాస్యప్రధాన చిత్రంలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ప్రభుదేవా, హన్సిక నటించిన ‘గులేబకావలి’ ఫేం కల్యాణ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో జ్యోతిక కీలకపాత్ర పోషిస్తున్నారు. సీనియర్‌ నాయిక రేవతి కూడా నటిస్తున్నారు. మహిళలకు గుర్తింపునిచ్చే రీతిలో కూడా కథ ఉంటుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం సమకూర్చుతున్నారు. యోగిబాబు, ఆనంద్‌రాజ్, మన్సూర్‌ అలీఖాన్, మొట్టై రాజేందద్రరన్, జగన్‌లు ఇతర తారాగణం. ఈ సినిమా పూజ కార్యక్రమం చెన్నైలో ఘనంగా జరిగింది. నటుడు సూర్య ముఖ్య అతిథిగా తొలి సన్నివేశానికి క్లాప్‌ కొట్టారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.