అప్పటి వరకూ వేచి ఉండాలా!
మిల్కిస్టార్‌ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం 'మహర్షి' షూటింగ్ పూర్తైపోనుంది. చిత్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఏప్రిల్ 25వ తేదీగా ప్రకటించారు కాబట్టి ఇందులో ఎలాంటి మార్పు ఉండే అవకాశం లేదు. ఇప్పటికే ఈ చిత్రం 5 నుంచి 25కు వెళ్లిందని మహేష్‌ అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే తరువాతి సినిమా సుకుమార్‌తోనే అని కన్ఫర్మ్ చేసిన మహేష్‌బాబుకు ఇంకా సబ్జెక్టు ఓకే కాలేదని ఫిలిం నగర్ సమాచారం. దీనికి కారణాలు చాలానే ఉన్నాయట. తొలుత చెప్పిన స్టోరీలైన్ మీద చాలా నమ్మకంగా ఉన్న సుకుమార్‌ అది ఓకే అవుతుందన్న నమ్మకంతోనే ఎక్కువ సమయం దీనికే ఖర్చు చేశాడు. దానికి ప్రిన్స్ నో చెప్పడంతో కొత్త స్క్రిప్ట్ వండే పనిలో పడ్డాడు. అయితే 'మహర్షి' పూర్తి అయ్యేలోపు అది సిద్ధమయ్యే పరిస్థితి లేకపోవడంతో సుకుమార్ మరో ఆరు మాసాలు కాలం కావాలని అడిగినట్టు సమాచారం. అదే నిజమైతే ఎంత లేదన్నా దీపావళికి పండుగకు కానీ సిద్ధం కాదన్నమాట.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.