విజయ్‌ సినిమాకు టైటిల్‌ చిక్కులు!

మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ పతాకంపై వస్తున్న సినిమా ‘హీరో’. విజయ్‌ దేవరకొండ కథనాయకుడు. క్రీడలు కథాంశంగా రాబోతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా తమిళంలో హీరో శివ కార్తీకేయన్‌ నటిస్తున్న ఓ సినిమాకి కూడా ‘హీరో’ అనే టైటిల్‌ పెట్టారు. విజయ్‌ దేవరకొండ నటిస్తున్న సినిమా బహుభాషా చిత్రం కావడంతో తమిళంలో కూడా ఇదే టైటిట్‌తో విడుదల చేస్తారు. దీంతో టైటిల్‌ విషయంలో ఎవరో ఒకరి సినిమాకు టైటిల్‌ మార్చాల్సిన పరిస్థితి. ఈ ఇద్దరి హీరోల్లో ఎవరు వెనక్కి తగ్గి తమ సినిమా పేరులో మార్పులు చేసుకొంటారో వేచిచూడాల్సిందే చూడాలి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.