బాలయ్య మెచ్చుకున్నారు..

‘పూరి పూరి‌లానే తీశా‌డని కొంద‌రం‌టు‌న్నారు.‌ కొత్త‌దనం కోసం ప్రయ‌త్నించి తన మార్క్‌నే మిస్స‌య్యా‌డని ఇంకొం‌ద‌రం‌టు‌న్నారు.‌ నాలు‌గై‌దు‌సార్లు చూశా‌మని ఇంకొం‌త‌మంది చెబు‌తు‌న్నారు.‌ నా మనస్సు పెట్టి తీసిన సినిమా ‌‘మెహ‌బూబా’‌.‌ ప్రేక్ష‌కుల స్పందన నాలో నమ్మ‌కాన్ని నింపింద‌ంటున్నారు పూరి జగ‌న్నాథ్‌.‌ ఆకాష్, నేహా‌శెట్టి నాయ‌కా‌నా‌యి‌క‌లుగా పూరి కనెక్ట్స్ పై ఛార్మి నిర్మిం‌చిన ఈ చిత్రం ఇటీ‌వలే విడు‌ద‌లైంది.‌ ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం పూరి జగ‌న్నాథ్‌ హైద‌రా‌బా‌ద్‌లో విలే‌క‌ర్లతో మాట్లా‌డారు.‌ ‌‘‌‘అమె‌రి‌కాలో తెలు‌గు‌వాళ్ల మధ్య సినిమా చూశా.‌ ఇక్కడా థియే‌టర్లో చూశా.‌ ప్రేక్ష‌కులు బాగా స్పంది‌స్తు‌న్నారు.‌ ఆకాష్‌ బాగా చేశా‌డని చెబు‌తు‌న్నారు.‌ నేను కోరు‌కు‌న్నది ఇదే.‌ నేను తీసే మామూలు కమ‌ర్షి‌యల్‌ చిత్రా‌ల్లాం‌టిది కాదు.‌ నిజా‌యతీ ఉన్న ప్రేమ‌క‌థా‌చి‌త్రాన్ని యువ‌త‌రమే కాదు కుటుం‌బాలు సైతం చూసి ఆనం‌ది‌స్తు‌న్నారు.‌ మా చిత్రబృం‌దాన్ని ఫోన్‌ చేసి మరీ ప్రశం‌సిం‌చిన నటుడు నంద‌మూరి బాల‌కృష్ణ నిజ‌మైన మిత్రుడు’‌’‌ అన్నారు.‌ ఆకాష్‌ మాట్లా‌డుతూ ‌‘‌‘ఇంత మంచి సిని‌మాను నాకి‌చ్చిన నాన్నకి కృత‌జ్ఞ‌తలు.‌ నేహా‌శెట్టి చక్కగా నటిం‌చ‌డంతో నాకూ నటిం‌చడం తేలి‌కైంది.‌ ఎంత కష్ట‌మైనా ప్రేక్ష‌కుల మెప్పు పొందే చిత్రాలు చేసేం‌దుకు కృషి చేస్తాను’‌’‌ అన్నారు.‌ ‌‘‌‘ఇలాంటి సిని‌మాలో భాగ‌స్వా‌మిని అయి‌నం‌దుకు ఆనం‌దంగా ఉంద’‌’‌ని అంది నేహా‌శెట్టి.‌ ఛార్మి మాట్లా‌డుతూ ‌‘‌‘థియే‌ట‌ర్ల‌లోని ప్రేక్ష‌కులు ఉల్లా‌సంగా కని‌పి‌స్తు‌న్నారు.‌ వారి స్పందన చూసిన మేమూ సంతో‌షి‌స్తున్నాం’‌’‌ అంది.‌ విష్ణు‌రెడ్డి, అజై, పృథ్వి తది‌త‌రులు పాల్గొ‌న్నారు.‌
సంబంధిత వ్యాసాలు


© Sitara 2018.
Powered by WinRace Technologies.