విజయ్‌ చిత్రంలో అర్జున్‌!

ర్కార్‌’ నటుడు విజయ్‌ నటిస్తున్న తన అరవైనాలుగో చిత్రంలో ‘మాపల్లెలో గోపాలుడు’ చిత్ర నటుడు అర్జున్‌ నటిస్తున్నట్లు సమాచారం. అది కూడా ప్రధాన ప్రతినాయక పాత్రనే పోషించనున్నారని సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఈ చిత్రానికి లోకేష్‌ కనకరాజ్‌ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రధాన కథానాయికలుగా రాశిఖన్నా, రష్మిక మందన్నలు నటిస్తున్నారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చనున్నారు. ఇప్పటి వరకూ ఈ వివరాలను చిత్ర బృందం అధికారింగా ఎక్కడా చెప్పడం లేదు. ప్రస్తుతం విజయ్‌ అట్లీ దర్శకత్వంలో ‘బిగిల్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు ఇందులో నయనతార కథానాయిక. సుమారు నూటనలభై కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్‌ 2019లో విడుదల కానుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.