నాని ఇంటి నుంచి డైరెక్ట‌ర్ కూడా

డైరెక్ట‌ర్ కాబోయే యాక్ట‌ర్ అయ్యాడు నాని. చిత్ర‌సీమ‌లో స‌హాయ ద‌ర్శ‌కుడిగానే ఆయ‌న ప్ర‌యాణం మొద‌లైంది. బాపు, కె.రాఘ‌వేంద్ర‌రావు త‌దిత‌రుల ద‌గ్గ‌ర ఆయ‌న ప‌నిచేశారు. `అష్టాచ‌మ్మా`తో క‌థానాయ‌కుడిగా మారిపోయాడు. ఈమ‌ధ్య నిర్మాత అవ‌తారం కూడా ఎత్తారు. వాల్ పోస్ట‌ర్ సినిమా అనే బ్యాన‌ర్‌ని ఏర్పాటు చేసి `అ` చిత్రాన్ని నిర్మించాడు. ఎప్పుడో ఒక‌సారి ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం చేసే అవ‌కాశాలు కూడా ఉన్నాయి. అయితే ఆయ‌న మెగాఫోన్ ప‌ట్ట‌డం కంటే ముందే, ఆయ‌న ఇంట్లో మ‌రొక‌రు ఆ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. త్వ‌ర‌లోనే నాని ఇంట నుంచి ఓ డైరెక్ట‌ర్ వెలుగులోకి రాబోతున్నారు. వాళ్లెవ‌రో కాదు... నాని సోద‌రి దీప్తి గంటా. `అన‌గ‌న‌గా ఒక నాన్న` అనే పేరుతో ఆమె ఓ షార్ట్ ఫిల్మ్ తీశారు. ఫాద‌ర్స్‌డే సంద‌ర్భంగా విడుదలైంది ఆ షార్ట్ ఫిల్మ్. ప్రస్తుతం ఇది యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో టాప్‌ టెన్‌లో ఉంది. మ‌రి దీప్తి గంటా పూర్తిస్థాయి సినిమాల్ని కూడా తెర‌కెక్కిస్తారేమో చూడాలి.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.