నాని నిర్మాణంలో విశ్వక్‌ సేన్‌?

కథానాయకులు నిర్మాతలుగా మారిన జాబితాలో నాని ఒకరు. వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై ‘అ!’ చిత్రాన్ని తెరకెక్కించాడు. మంచి విజయం అందుకోవడమే కాదు అవార్డులను సైతం సొంతం చేసుకుందీ సినిమా. అదే ఉత్సాహంతో మరికొన్ని చిత్రాలను ప్లాన్‌ చేస్తున్నట్లు గతంలో చెప్పాడు నాని. అయితే తాజాగా ఈ విషయంపై ఓ ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చింది. అదేంటంటే?.. ‘ఫలక్‌నుమా దాస్‌’ చిత్ర కథానాయకుడు విశ్వక్‌ సేన్‌తో ఓ సినిమాను నిర్మించేందుకు సిద్ధమవుతున్నాడట. ఏ జోనర్, దర్శకడు ఎవరు.. వంటి వివరాలు ఇంకా బయటకు రాలేదు. అతి త్వరలోనే ఈ ప్రాజెక్టుపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పుడిదే వార్త సామాజిక మాధ్యమాల్లో అందరినీ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం నాని ‘వి’ చిత్రంతో బిజీగా ఉన్నాడు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.