కమాండో అర్జున్‌ వస్తున్నాడు!
ఆది సాయికుమార్, శషా చెట్రి, కార్తీక్‌ రాజు, పార్వతీశం, నిత్యా నరేష్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’. సాయికుమార్‌ అడివి దర్శకుడు. ప్రతిభా అడివి, కట్ట ఆశిష్‌ రెడ్డి, కేశవ్‌ ఉమా స్వరూప్, పద్మనాభరెడ్డి, గేరి. బిహెచ్, సతీష్‌ డేగలతో పాటు ఈచిత్రానికి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ కలసి నిర్మించిన చిత్రమిది. దీపావళి సందర్భంగా ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా రాసుకున్న కల్పిత కథ ఇది. కమాండో అర్జున్‌ పండిట్‌ పాత్రలో ఆది కనిపిస్తారు. ఈ చిత్రంలో ప్రతీ పాత్ర కీలకమే. చివరి షెడ్యూల్‌లో భాగంగా కార్గిల్, హిమాచల్‌ ప్రదేశ్‌లలో మైనస్‌ పది డిగ్రీల ఉష్ణోగ్రతలో ప్రధాన సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నాం. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామ’’న్నారు.© Sitara 2018.
Powered by WinRace Technologies.