మనమంతా పల్లెవాసులం
ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి తనయుడు రాకేందు మౌళి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘పల్లెవాసి’. కల్కి కథానాయిక. గోరంట్ల సాయినాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జి.రాంప్రసాద్‌ నిర్మిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘పల్లెటూరి జీవితాలకి అద్దం పట్టే కథ ఇది. గ్రామీణ నేపథ్యంతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరి మనసుల్నీ హత్తుకొనేలా, వాళ్ల కథే అనే అభిప్రాయాన్ని కలిగిస్తూ ఈ చిత్రం సాగుతుంది’’ అన్నారు. ‘‘తొంభై శాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’న్నారు నిర్మాత. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: లక్ష్మణ్‌.




© Sitara 2018.
Powered by WinRace Technologies.