అసలు టైటిల్‌ ఏదో?
‘బాహుబలి 2’ తరవాత ప్రభాస్‌ సినిమా ఏదీ తెరపైకి రాలేదు. అయితే ఒకేసారి రెండు చిత్రాల్ని పూర్తి చేసి అభిమానులకు డబుల్‌ బొనాంజా ఇవ్వడానికి సిద్ధమయ్యాడు ప్రభాస్‌. తను కథానాయకుడిగా నటిస్తున్న ‘సాహో’ చిత్రీకరణ దశలో ఉంది. ఈలోగా మరో చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాడు ప్రభాస్‌. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్, గోపీ కృష్ణ మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే కథానాయిక. ప్రస్తుతం ఇటలీలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా కోసం రెండు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ‘అమూర్‌’ అనే ఫ్రెంచ్‌ పదం టైటిల్‌గా పరిశీలిస్తున్నారు. అమూర్‌ అంటే ప్రేమ అని అర్థం. ‘జాన్‌’ అనే మరో పేరు కూడా పరిశీలనలో ఉంది. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. హిందీ ప్రేక్షకులకూ, తెలుగువాళ్లకీ అర్థమయ్యేలా ఒకే టైటిల్‌ని ఖరారు చేయాలన్నది చిత్రబృందం ఆలోచన.© Sitara 2018.
Powered by WinRace Technologies.