ప్రభాస్‌ ‘జాన్‌’కు త్వరలో శ్రీకారం
‘సాహో’ చిత్రం తరువాత ప్రభాస్‌ ఎలాంటి చిత్రంలో నటించనున్నాడని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ ‘జాన్‌’ అనే చిత్రంలో నటించనున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. రాధా కృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘జాన్‌’ చిత్రం ఈ నెల్లోనే సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఇందులో ప్రభాస్‌ సరి కొత్త అవతారంలో కనిపించనున్నారని చెప్పుకుంటున్నారు. రొమాంటిక్‌ డ్రామా నేపథ్యంగా వస్తున్న చిత్రాన్ని కృష్ణంరాజు స్వంత సంస్థ అయిన గోపీకృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మించనున్నాయి. దర్శకుడు రాధా కృష్ణ ‘అనుకోకుండా ఒకరోజు’ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆ తరువాత ఎన్నో చిత్రాలకు అసిస్టెంట్‌ దర్శకుడి రాణించిన రాధాకృష్ణ, గోపీచంద్‌ హీరోగా ‘జిల్‌’ అనే చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.