ఈ ఇద్దరి ప్రేమ లోకంలో..
రాజ్‌ తరుణ్, షాలినీ పాండే నాయకానాయికలుగా దర్శకుడు జి.ఆర్‌.కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. సామాజిక మాధ్యమాల వేదికగా ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో కథానాయిక షాలినీ బైక్‌ నడుపుతుంటే రాజ్‌ తరుణ్‌ వెనక కూర్చుని నవ్వుతూ కనిపిస్తాడు. ప్రేమ లోకంలో విహరిస్తున్న ఈ ఇద్దరి జోడీ యువతను ఆకట్టుకుంటుంది. వాళ్ల ప్రేమ కథేంటో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె.మేయర్‌ అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.