అదే సవాళ్లను స్వీకరించేలా చేస్తోంది
‘నా పరిమితులు ఇవీ, నేనింతే చేయగలగని ముందే ఓ నిర్ణయానికి రావడం నాకు నచ్చదంటుంది కథానాయిక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. రోజూ ఓ కొత్త ప్రయత్నం చేయాల్సిందే, కొత్త సవాళ్లని ఎదుర్కోవాల్సిందేనని చెబుతోంది. ప్రస్తుతం ‘భారతీయుడు 2’లో నటిస్తుందీ భామ. ‘‘నిన్నటిలాగే ఈ రోజూ గడిస్తే విశేషం ఏముంటుంది? నిన్నటి కంటే కొత్తగా చేయాలనుకుంటా. ఆ ఆలోచనా ధోరణి నా సినీ ప్రయాణానికి ఎంతో మేలు చేస్తోంది. సినిమాలో పాత్రలు విసిరే సవాళ్లని మరింత ఆత్రుతతో స్వీకరించడానికి అదే దోహదం చేస్తోంద’ని చెప్పింది రకుల్‌. ఫిట్‌నెస్‌ విషయంలో ముందుండే ఈమెకి క్రీడలన్నా ఇష్టమే. ‘‘ఫిట్‌నెస్‌ అనగానే డైట్‌ ప్రస్తావన తెస్తుంటారు. కానీ డైట్‌కు ఇష్టపడను. ఆటలు కూడా నా జీవితంలో భాగమే. ఖాళీ దొరికితే గోల్ఫ్‌ ఆడతా’ అంటుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.