రవితేజ కథానాయకుడిగా ‘కనకదుర్గ’

కోలీవుడ్‌లో కాసులు కురిపించిన సినిమా ‘తెరి’. ఈ సినిమా అక్కడ బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని నమోదు చేసింది. అట్లీ దర్శకత్వంలో రూపొందింది. విజయ్, సమంతలు నాయకనాయికలుగా నటించారు. ఇప్పుడీ సినిమా తెలుగులో ‘కనకదుర్గ’గా రాబోతోంది. మైత్రి పతాకంపై నిర్మిస్తున్నారు. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకుడు. రవితేజ, కథానాయకుడు. కాజల్‌ లేదా కేథరీన్‌లను కథానాయికలుగా అనుకొంటున్నారు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకుడు. ఏప్రిల్‌ 15నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కాబోతోంది. అధికారికంగా వివరాలను త్వరలో వెల్లడిస్తారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.