రైతు సమస్యలపై రేణు సినిమా

మరాఠీ చిత్రానికి దర్శక నిర్మాతగా వ్యవహరించిన అనుభవంతో మరోసారి మెగా ఫోన్‌ పట్టుకోబోతోంది నటి రేణూదేశాయ్‌. తెలుగులో ఒక చిత్రాన్ని రూపొందించనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకిచ్చిన ముఖాముఖిలో వెల్లడించారామె. దేశంలో అన్నదాతలు వ్యవసాయం చేసేందుకు ఎన్నో కష్టనష్టాలను భరించాల్సి వస్తోందని, వారి ఇబ్బందులను చిత్రరూపంలో మలచి ప్రజలకు చూపించాలనుకొంటున్నానని చెప్పింది. స్వయంగా ఒక గ్రామానికి వెళ్లి అక్కడి రైతులతో గడిపి వారి కష్టాలను అడిగి తెలుసుకొని కథకు అవసరమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకొందట. స్వీయ నిర్మాణంలో రూపొందించబోయే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రారంభిస్తున్నట్లు చెప్పింది.
© Sitara 2018.
Powered by WinRace Technologies.