ఆ రోజున ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ టైటిల్‌ రివీల్‌?

ఈ దశాబ్ద కాలంలోనే అతి పెద్ద మల్టిస్టారర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’. దర్శకధీరుడు జక్కన్న దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ యన్‌టీఆర్, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కాంబీనేషన్‌లో వస్తున్న అతి పెద్ద పాన్‌ ఇండియా మూవీ ఇది. అయితే రాజమౌళి చిత్రాలకి సినిమా ప్రచారం చిత్రీకరణ నుంచే సాగుతుంది అన్న విషయం తెలిసిందే. అందుకు తగ్గ ప్రణాళికలు ముందే సిద్ధం చేసుకుంటారు ఆయన. ప్రస్తుతం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ విషయంలో కూడా ఇదే పంథాని కొనసాగిస్తున్నారు. తొలి షెడ్యూల్‌ మొదలుపెట్టేటప్పుడు షూటింగ్‌ బిగిన్‌ అయినట్టుగా చిన్న వీడియో విడుదల చేశారు. ఆ తరువాత ప్రెస్‌ మీట్‌ పెట్టి సినిమా కథపై వస్తున్న వదంతులకు చెక్‌ పెడుతూ మూలకథను రివీల్‌ చేసి, కొమురం భీంగా తారక్, అల్లూరీ సీతారామరాజుగా చరణ్‌ నటిస్తున్నట్లు ప్రకటించారు. అదే వేదికలో సినిమా టైటిల్‌ మీరే పెట్టండి అంటూ సినీ ప్రేక్షకులకు ఛాయిస్‌ వదిలారు. అప్పటి నుంచి రకరకాల టైటిల్స్‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ టైటిల్‌ ఇదేనంటూ వైరల్‌ అవ్వసాగాయి. రీసెంట్‌గా ‘రామ రౌద్ర రుషితం’ అనే టైటిల్‌ను పైనల్‌ చేశారనే వార్త ఫిలింనగర్‌లో హాట్‌ టాఫిక్‌గా మారింది. ఇప్పుడు వీటిపై క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధం అయిపోయారు జక్కన్న. ఈ నెల 22న కొమురం భీం జయంతి రోజున ఆ పాత్రలో కనిపించే తారక్‌ లుక్‌తో పాటుగా సినిమా టైటిల్‌ను కూడా రివీల్‌ చేయనున్నారనీ టాలీవుడ్‌ టాక్‌. అందుకనే ఆ రోజు కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు సినీ జనాలు.






Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.