ముద్దులకు భయపడ్డారు

ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు? ఏ సినిమా బాగా ఆడుతుందో, ఏ సినిమా.. సంచలనాలు సృష్టిస్తుందో ఎవరికి ఎరుక? మొన్నటి వరకూ పాయల్‌ రాజ్‌పుట్‌ అంటే ఎవరికీ తెలీదు. ఒక్క సినిమాతోనే పాపులర్‌ అయిపోయింది. ఇప్పుడు అందరి నోటా ఆమె మాటే. ‘ఆర్‌.ఎక్స్‌ 100’లో ఘాటు ముద్దులిచ్చి బాగా పాపులర్‌ అయిపోయింది పాయల్‌. నిజానికి ఈ పాత్ర చేయడానికి చాలామంది కథానాయికలు భయపడ్డారట. తాను ధైర్యం చేయడం వల్లే ఇంత మంచి పేరొచ్చిందంటోంది. ‘‘ఈ పాత్ర చాలా మంది కథానాయికలకు వినిపించారు. ఇందులో ఉన్న ముద్దు సన్నివేశాలు చూసి భయపడ్డారు. నేను మాత్రం అలాంటి భయాలేం పెట్టుకోలేదు. ఇలాంటి బోల్డ్‌ పాత్రలు చేయడానికి చాలా ధైర్యం ఉండాలి. అది నాకు ఉంది. అందుకే ఈ సినిమా ఒప్పుకున్నా. అదే నాకు మంచి పేరు తీసుకొచ్చింది’’ అంటోంది.




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.