‘సాహో’ కోసం జిబ్రాన్‌

ప్ర
భాస్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సాహో’. సుజిత్‌ దర్శకుడు. చిత్రీకరణ దాదాపుగా పూర్తికావొచ్చింది. అయితే ఇప్పటి వరకూ సంగీత దర్శకుడి పోస్టు అలానే ఖాళీగా ఉండిపోయింది. బాలీవుడ్‌ త్రయం శంకర్‌ ఎహ్‌సాన్‌ లాయ్‌లను స్వరకర్తలుగా నియమించుకుంది చిత్రబృందం. అయితే అనివార్య కారణాల వల్ల వాళ్లు టీమ్‌ నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచీ ‘సాహో’ కోసం సంగీత దర్శకుడి వేట సాగుతూనే ఉంది. ఇప్పుడు ఆ స్థానంలో జిబ్రాన్‌ని తీసుకున్నారు. ‘రన్‌ రాజా రన్‌’, ‘విశ్వరూపం’, ‘జిల్‌’ వంటి చిత్రాలకు సంగీతం అందించారు జిబ్రాన్‌. ‘సాహో చాప్టర్‌ 1’, ‘సాహో చాప్టర్‌ 2’ ప్రచార చిత్రాలకు కూడా జిబ్రానే నేపథ్య సంగీతం ఇచ్చారు. ఇప్పుడు ‘సాహో’ చిత్రానికీ ఆయనే నేపథ్య సంగీతం అందివ్వనున్నారు. ‘‘యాక్షన్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. నేపథ్య సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉంది. జిబ్రాన్‌ ఈ విషయంలో సిద్ధహస్తుడు. అందుకే ఆయన్ని ఎంచుకున్నాం’’ అని చిత్రబృందం ప్రకటించింది. శ్రద్దాకపూర్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేస్తారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.