ఈ రెండు చేతులు.. లుక్ చూపించేది రేపే!

కరు.. చేతిలో చేయి వేసి బంధం విలువ తెలియజేసేందుకు సిద్ధమయ్యారు. మరొకరు.. కుంచె పట్టుకుని తన చిత్ర లేఖనంతో ఏదో చెప్పేందుకు ప్రయత్నించబోతున్నారు. ఈ రెండు పోస్టర్లు చూస్తుంటే అదే అనిపిస్తుంది కదా. ఇంతకీ ముఖం చూపించకుండా కేవలం చేతులతోనే ఆసక్తి పెంచుతుంది ఎవరు అనే సందేహంలో ఉన్నారా? మీ సందేహానికి సమాధానంతోపాటు సర్‌ప్రైజ్‌ కూడా ఉంటే భలే ఉంటుంది కదా. వేలు విడువని బంధం అంటూ సాయి ధరమ్‌ తేజ్‌ ‘ప్రతి రోజూ పండగే’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి సంబంధించిన పోస్టరే అది. పెయింటింగ్‌ వేస్తుంది ఎవరో కాదు ప్రముఖ నటి అనుష్క. ఆమె నటిస్తున్న ‘నిశ్శబ్దం’ చిత్రంలోనిదే ఆ పోస్టర్‌. ఈ ఇద్దరి నటుల అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఏంటంటే.. సాయి ధరమ్‌తేజ్‌, అనుష్క ఫస్ట్‌లుక్‌ రేపే విడుదలకానున్నాయి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.