నెట్‌ఫ్లిక్స్‌లో సాయి పల్లవి..


చిత్ర పరిశ్రమ లో కొందరు అందంతో, మరికొందరు అభినయంతో, ఇంకొదరు నృత్యాలతో రాణిస్తు స్టార్‌ కథానాయికగా ఎదుగుతారు. ఒకోక్కరు ఒక్కో ప్రత్యేకత ఏర్పరచుకుంటారు. కాని సాయి పల్లవి మాత్రం అన్నిటిలోను ప్రత్యేకతను ఏర్పరచుకున్న అరుదైన కథానాయిక. అందం, అభినయం, నృత్యాలు అన్నిటితోను మెప్పించే నటి ఆమె. దక్షిణాదిలో ఉండే బిజీ కథానాయికలో ఒకరు. ఇప్పుడు ఆమె డిజిటల్‌ మాధ్యమంలోకి అడుగుపెడుతోంది. అమెజాన్‌ ప్రైమ్‌కి గట్టి పోటి ఇవ్వలనుకున్న నెట్‌ఫ్లిక్స్‌ ప్రాంతీయ భాషల్లో స్థానిక తారలతో ప్రత్యేకంగా వెబ్‌సిరీస్‌లను మొదలుపుడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే హిందీలో ‘లస్ట్‌ స్టోరీస్‌’ని తీసి విజయవంతమైంది. ఇప్పుడు దక్షణాదిపై దృష్టి సారించింది. ఇక్కడ కూడా నలుగురు దర్శకులు నాలుగు కథలను కలిసి ఒక వెబ్‌సిరీస్‌ను తీసుకురావాలనుకుంటుంది. ఇవి ప్రేమకథలుగా ఉంటాయని వినికిడి.. పరువు హత్యల నేపథ్యంగా కథనం సాగుతుందట. ఇందులోనే ఒక కథలో సాయి పల్లవి నటించనుందని సమాచారం. ఈ కథకు ‘అసురన్‌’ దర్శకుడు వెట్రిమారన్‌ దర్శకత్వం వహిస్తారట. మిగతా కథలకు గౌతమ్‌ మేనన్, సుధా కొంగర, విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం చేస్తారని కోలీవుడ్‌ సమాచారం. వెండితెరపై అగ్ర కథానాయికగా వెలుగుతున్న సాయి పల్లవి వెబ్‌సిరీస్‌తో కూడా మెప్పింస్తుందో చూడాలి మరి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.