ఎన్ని కోట్లయినా నాకొద్దు!

చిత్ర పరిశ్రమలో కొందరు అందంతో, మరికొందరు అభినయంతో, ఇంకొందరు నృత్యాలతో రాణిస్తూ స్టార్‌ కథానాయికగా ఎదుగుతారు. ఒకోక్కరు ఒక్కో ప్రత్యేకత ఏర్పరచుకుంటారు. సాయి పల్లవి మాత్రం అన్నిటిలోను ప్రత్యేకతను ఏర్పరచుకున్న అరుదైన నాయిక. అందం, అభియనం, నృత్యాలు అన్నిటితోను ‘ఫిదా’ చేసే నటి ఆమె. దక్షిణాదిలో ఖాళీ లేకుండా ఉండే కథానాయికలో ఒకరు. ఆమెకు ఒక ప్రముఖ సౌందర్య ఉత్పత్తుల సంస్థ నుంచి కోట్లు విలువ చేసే ఆఫర్‌ వచ్చింది. తమ సంస్థకి ప్రచారకర్తగా ఉండటానికి అంగీకరిస్తే భారీ పారితోషికం ఇస్తామని చెప్పారట. అందం అనేది సౌందర్య ఉత్పత్తుల ద్వారా రాదని కోట్లు సంపాదించే అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించిందని సమాచారం. గతంలో కూడా ఇలాంటి ఒక సంస్థకు ప్రచారం చేయనని చెప్పింది ఈ భామ. ఇలాంటి వ్యక్తిత్వంతో కూడా అభిమానుల్ని సంపాధించుకుంటుంది భానుమతి. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ‘విరాటపర్వం’లో ఒక విభిన్నమైన పాత్ర పోషిస్తుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.