మహేష్‌ మేనల్లుడ్ని తెరకెక్కిస్తున్న శ్రీరామ్‌?

‘భలే మంచి రోజు’ చిత్రంతో దర్శకుడుగా పరిచమయ్యాడు శ్రీరామ్‌ ఆదిత్య. ఆ తర్వాత ‘శమంతకమణి’, ‘దేవదాసు’ చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు. తాజాగా తను తెరకెక్కించనున్న నాలుగో చిత్రంపై ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదేంటంటే? రాజకీయ నాయకుడు గల్లా జయదేవ్‌ కుమారుడు అశోక్‌ను తెరకెక్కించబోతున్నాడట శ్రీరామ్‌.  గతంలో అశోక్‌ కథానాయకుడుగా ఓ చిత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే. పలు కారణాల వల్ల అది విడుదల కాలేదు. ఇప్పుడు రెండో చిత్రం పట్టాలెక్కించనున్నాడు అశోక్‌. శ్రీరామ్‌కు కలిసొచ్చిన జోనర్‌ క్రైమ్‌ బ్యాక్‌డ్రాప్‌తో కూడిన సెంటిమెంట్‌ కథాంశంతో తెరకెక్కిస్తున్నారని సినీ వర్గాల సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. మహేష్‌బాబు ఫ్యామిలీలోని సుధీర్‌ బాబుతో ‘భలే మంచి రోజు’ చిత్ర అనుబంధం ఉండటంతో ఇప్పుడు ఈ అవకాశం అందుకున్నాడని అంటున్నారు అభిమానులు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.