పెద్దబ్బాయ్‌ ప్రేమకథతో.. చిన్నబ్బాయ్‌ హారర్‌తో..

కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు కథానాయకుడు శ్రీకాంత్‌. సినీ కెరీర్‌లో శతకం పూర్తి చేసిన ఆయన తన పెద్ద అబ్బాయ్‌ రోషన్‌ను వెండితెరకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ‘నిర్మలా కాన్వెంట్‌’ అనే ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించాడు రోషన్‌. అయితే ఇప్పుడు శ్రీకాంత్‌ రెండో కుమారుడు కూడా తెరంగ్రేటం చేయబోతున్నాడు. ప్రభుదేవా, మమతా మోహన్‌దాస్‌ ప్రధాన పాత్రల్లో ఓ హారర్‌ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో ప్రభు, మమతాకు కొడుకుగా నటించనున్నట్లు సమాచారం. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభంకానుంది. ఇందులో దెయ్యం కారణంగా బాధపడే పాత్ర పోషించనున్నాడు రోహన్‌. ఇలా తన పెద్దబ్బాయ్‌ని ప్రేమకథతో పరిచయం చేసి, చిన్నబ్బాయ్‌ని హారర్‌తో వెండితెరకు పరిచయం చేస్తున్నారు శ్రీకాంత్‌.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.