అక్కడ సన్నీ... ఇక్కడ షకీలా

జీవిత కథల్లో కాస్త సంఘర్షణ, ఇంకాస్త మసాలా ఉంటే చాలు. బయోపిక్‌కి అర్హత సాధించేసినట్టే. సినిమావాళ్ల జీవితాల్లో సంఘర్షణ కంటే మసాలా ఎక్కువ. అందుకే సినీ కథలు, జీవితాలు బయోపిక్‌ల అవతారం ఎత్తుతున్నాయి. సిల్క్‌స్మిత కథ ‘థర్టీ పిక్చర్‌’గా వచ్చి సూపర్‌ హిట్టయ్యింది. సంజయ్‌దత్‌ జీవితం ‘సంజూ’గా తెరకెక్కి కోట్లు కొల్లకొడుతోంది. ఇప్పుడు సన్నిలియోన్‌ కథ కూడా తెరకెక్కేసింది. ‘కరేన్‌ జిత్‌ కౌర్‌’ పేరుతో వెబ్‌ సిరీస్‌గా రూపొందింది. ఇప్పుడు షకీలా కథ వెండి తెరపైకొస్తోంది. 90వ దశకంలో తిరుగులేని శృంగారతారగా పేరు తెచ్చుకుంది షకీలా. ఆమె సినిమా వస్తోందంటే మలయాళంలో టాప్‌ హీరోలు కూడా దడదడలాడిపోయేవారు. షకీలా ఎదిగిన విధానం, సినిమాల్లో ఆమెకు ఎదురైన అనుభవాలు, ఇవన్నీ కథగా రూపొందించి వెండి తెరపై చూపించబోతున్నారు. ఇంద్రజిత్‌ లంకేష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. షకీలా పాత్రని రిచా చద్దా పోషించబోతోంది. షకీలా అంటే తెలుగు, తమిళ సినీ అభిమానులకూ బాగా తెలుసు. కాబట్టి... సౌతిండియాలోని అన్ని భాషల్లోనూ విడుదల చేసే ఛాన్సుంది. శృంగారతార జీవితంపై తెరకెక్కుతున్న సినిమా కాబట్టి... డిమాండ్‌ కూడా బాగానే ఉండేట్టు కనిపిస్తోంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.