చిరంజీవి నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక భారీ చిత్రం ‘సైరా’. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను ఒక్కోక్కటిగా షురూ చేయాలని నిర్ణయించారట చిత్రబృందం. మొదటగా ఆగస్టు 14న చిత్ర మేకింగ్ వీడియోను విడుదల చేసి, ఆ తరువాత టీజర్ 20వ తేదీన విడుదల చేయాలనుకుంటున్నారట. టీజర్ వేడుకను ముంబైలో ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఈ చిత్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన నటీనటులు నటిస్తున్నారు. అందులోనూ ఈ ఆగస్టులోనే చిరంజీవి పుట్టిన రోజు కావడం విశేషం. రామ్ చరణ్ నిర్మాణంలో వస్తున్న సినిమాలో బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, తమిళం నుంచి విజయ్ సేతుపతి, కన్నడ నుంచి కిచ్చా సుదీప్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కథానాయికగా నయనతార నటిస్తుంది. జగపతిబాబు కూడా ఇందులో నటిస్తున్నారు.