రేపే సైరా మలి విడుదల...

భారతదేశంలో మొట్టమొదటి స్వాతంత్య్ర పోరాట యోధడు ‘సైరా నరసింహారెడ్డి’ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా రేపు అన్ని భాషల్లో మరోసారి విడుదలకు సిద్ధం అయింది. నేటికి సరిగ్గా ‘సైరా’ విడుదలై 50 రోజులు. మరి మరోసారి విడుదల చేయటం అని ఆలోచిస్తున్నారా? అదేనండి, డిజిటల్‌ మాధ్యమం అమొజాన్‌ ప్రైమ్‌లో మరోసారి అన్ని ప్రాంతీయ భాషల్లో స్ట్రీమీంగ్‌ అవుతోంది. ఇప్పుడు ఉన్న నిబంధనల ప్రకారం సినిమా విడుదలైన 50 రోజుల వరకు డిజిటల్‌ మాధ్యమంలోకి తీసుకురావటానికి వీల్లెదు. కానీ హిందీ వెర్షన్‌ మాత్రం ఈ నెల 28 నుంచి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.