మనం మనలానే ఉండాలి


‘‘కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అందుకే ఒకరిని చూసి అనుకరించడం కాకుండా, మనలా మనం ఉండటానికి ప్రయత్నించాలి’’ అంటోంది తమన్నా. దక్షిణాది అగ్ర కథానాయికల్లో తమన్నా ఒకరు. హిందీలోనూ అవకాశాలు అందుకొంటోంది. నటి కావాలనే లక్ష్యంతోనే పెరిగి, తన కలల్ని సాకారం చేసుకొన్న కథానాయిక తమన్నా. మీ నటనపై ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటుందని అడిగితే... ‘‘మాధురీదీక్షిత్‌ డ్యాన్సులు చూడటం మొదలుకొని... టీవీల్లో ఏ కథానాయిక కనిపించినా వాళ్లని ప్రత్యేకంగా గమనించేదాన్ని. కానీ వాళ్లలా కాకుండా నాకంటూ ప్రత్యేకత ఉండాలనుకొన్నా. అలాగే కెరీర్‌ని తీర్చిదిద్దుకున్నా. పని విషయంలో తపన ఉంటే కోరుకొన్నవన్నీ దరి చేరుతాయనేది నా నమ్మకం. అందరూ నమ్మాల్సింది కూడా అదే’’ అంది తమన్నా.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.