విలన్‌ను చేసిన దర్శకుడితో హీరోగా..


ర్శకుడు తేజకు హీరో గోపీచంద్‌కు చిత్రసీమలో మంచి అనుబంధం ఉంది. గోపీని వెండితెరపై ఓ నటుడిగా, పవర్‌ఫుల్‌ విలన్‌గా నిలబెట్టడంలో తేజ కృషి ఎంతో ఉంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘జయం’, ‘నిజం’ చిత్రాల్లో గోపీచంద్‌తో ప్రతినాయకుడి పాత్రలు చేయించి అతనికి గొప్ప విజయాలు అందించాడు. ఇక ఆ తర్వాత అతను హీరోగా మారినా తేజ డైరెక్షన్‌లో చేసే అవకాశమైతే రాలేదు. కానీ, ఇన్నాళ్లకు వీళ్లిద్దరి కలయికలో ఓ సినిమా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ‘చాణక్య’ చిత్రంతో బిజీగా ఉన్న గోపీచంద్‌.. తన తర్వాతి ప్రాజెక్టును తేజ దర్శకత్వంలో చేయడానికి రెడీ అవుతున్నాడట. ఇప్పటికే కథ విషయమై వీళ్లిద్దరి మధ్య చర్చలు కూడా జరిగిపోయినట్లు సినీవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. మరోవైపు సంపత్‌ నంది, శ్రీవాస్‌ వంటి దర్శకులు కూడా గోపీచంద్‌ కోసం కథలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. మరి వీరిలో తొలి అవకాశాన్ని గోపీ ఎవరికిస్తాడో వేచి చూడాలి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.