మణి చిత్రంలో త్రిష నటించనుందా?

నటి త్రిష మొదట తెలుగులో ‘నీ మనసు నాకు తెలుసు’ ద్వారా పరిచమైనా, పేరొచ్చింది మాత్రం ‘వర్షం’ సినిమాతోనే. ఆ తరువాత టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలను రాబట్టుకోగలిగింది. తమిళంలో ఇప్పటికీ అగ్రహీరోల సరసన నటిస్తూ మెప్పిస్తోంది. ప్రస్తుతం త్రిష మణిరత్నం తీయబోయే భారీ చిత్రం ‘పొన్నియన్‌ సెల్వన్‌’లో నటించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే సైట్స్‌పైకి రానుంది. ఇందులో ఐశ్వర్యరాయ్, విక్రమ్, మోహన్‌బాబు, విజయ్‌ సేతుపతి, కీర్తి సురేష్, కార్తిలు నటిస్తున్నారు. ఈ భారీతారాగణంలో త్రిష పేరు కూడా వినిపిస్తోంది. సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం త్రిషతో సంప్రదింపులు జరిపేందుకు సిద్ధమైయ్యారని సమాచారం. మలయాళంలో మోహన్‌లాల్‌ సరసన, ఇటు తెలుగులో చిరంజీవి కొత్త చిత్రంలో నటించే అవకాశాలు త్రిష ఇంటి తలుపు తడుతున్నాయని చెబుతున్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.