హ‌రీష్ ప్రేమ‌క‌థ తీయాల‌నుకుంటే.. వ‌రుణేమో!

వ‌రుణ్‌తేజ్‌తో `వాల్మీకి` తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు హ‌రీష్‌శంక‌ర్‌. ఆ సినిమా ప్ర‌చార చిత్రాలు అంచ‌నాల్ని పెంచేశాయి. ఈ నెల 20న విడుద‌ల‌య్యే ఆ సినిమా అంచ‌నాల‌కి దీటుగానే రూపొందింద‌ని హ‌రీష్‌తోపాటు చిత్ర‌బృందం మొత్తం చెబుతోంది. సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మంలో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని వెల్ల‌డించాడు క‌థానాయ‌కుడు వ‌రుణ్‌తేజ్‌. మొద‌ట హ‌రీష్‌శంక‌ర్ ఓ ప్రేమ‌క‌థ‌తో త‌న ద‌గ్గ‌రికొచ్చాడ‌ని ఆయ‌న చెప్పారు. ``క‌థ గురించి మా మ‌ధ్య 8 గంట‌లపాటు చ‌ర్చ సాగింది. చివ‌రికి నేను `జిగ‌ర్తాండ‌` రీమేక్ చేయాల‌నుకొంటున్నాన‌ని హ‌రీష్‌శంక‌ర్‌కీ, ఆయ‌న నాతో `జిగ‌ర్తాండ‌` రీమేక్ చేయాల‌ని ఫిక్స‌య్యార‌ని నాకు అర్థ‌మైంది. అలా `వాల్మీకి` కుదిరింద‌``ని చెప్పుకొచ్చాడు వ‌రుణ్‌. దీనిపై హ‌రీష్‌శంక‌ర్ స్పందిస్తూ... ``వ‌రుణ్ చెప్పింది నిజ‌మే. `ఫిదా`లాంటి సినిమా త‌ర్వాత నేను వ‌రుణ్‌శైలికి త‌గ్గ క‌థ‌నే రాసుకొని వెళ్లాను. ఆయ‌న మాత్రం మీ శైలి సినిమాలోనే న‌టిస్తాన‌ని చెప్పాడు. అలా `వాల్మీకి` కుదిరింది`` అని చెప్పాడు. మొత్తమ్మీద ఇద్ద‌రూ ఊహించ‌ని రీతిలో `వాల్మీకి` చేశార‌న్న‌మాట‌. ఇందులో గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ అనే డాన్ పాత్ర‌లో వ‌రుణ్ సంద‌డి చేయ‌బోతున్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.